Thursday, March 12, 2020

రెడ్ మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ నీ ప్రకటించిన xiaomi

నమస్తే, xiaomi రెడ్ మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ను విడుదల చేయటం జరిగింది. ఇక ఈ మోడల్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ను ఫోన్ లాక్ మరియు unlock చేయటం కోసం ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే ఈ మోడల్ స్మార్ట్ ఫో న్ 3 రోంగుల్లో 🥳 మరియు 3 వేరియంట్ లో తీసుకురావటం జరిగింది. అందులో ముందుగా నోట్ 9 ప్రో మ్యాక్స్ లో చూసుకుంటే 3 రంగులు అంటే వైట్, బ్లాక్, అరోరా బ్లూ కలర్ ఇవ్వటం జరిగింది. ఇక వేరియంట్ మరియు ధరలు చూసుకుంటే కింద విధం గా ఉన్నాయి.
6GB/64GB > 14,999₹
6GB/128GB > 16,999₹
8GB/128GB > 18,999₹ గా ధరలను పెట్టటం జరిగింది.
ఇక కెమెరా విషయాలకు వస్తే వీటినే ఎక్కువగా xiaomi ఫోకస్ చేసినట్లు రిలీజ్ ఈవెంట్ చాలా స్పష్టంగా తెలుస్తోంది. ధర లో మార్పులు కేవలం మెమరీ బట్టి కేటాయించటం జరిగింది కెమెరా ఫీచర్స్ అంతా ఒకటే అని చెప్పాలి. ఇక బ్యాక్ 4 కెమెరాలు ఫ్రంట్ ఒక కెమెరా ఇవ్వటం జరిగింది.అలాగే ఇందులో 4k వీడియో రికార్డ్ అది కూడా 30FPS తో చేసుకునే సదుపాయం ఉంది.
ఈ మోడల్ కి చెందిన పూర్తి కెమెరా కి చెందిన వివరాలు కింద ఇవ్వటం జరిగింది.

బ్యాక్ సైడ్ కెమెరాలు

📷 64 MP వైడ్ ప్రైమరీ కెమెరా
📷 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా
📷 5MP మాక్రో కెమెరా
📷 2MP డెప్త్ సెన్సార్

ఫ్రంట్ కెమెరా వివరాలు
32MP సెల్ఫీ కెమెరా అది కూడా డిస్ ప్లే లోపల ఇవ్వటం జరిగింది.
ఇక ఈ కెమెరా 4k వీడియో తీయటం కుదరదు.

ఈ నోట్ 9 ప్రో మ్యాక్స్ మోడల్ కి ప్రొటెక్షన్ గా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అనేది మూడు లేయర్స గా ఇవ్వటం జరుగుతోంది.

ఇక రెండు ర్యాం మోడల్స్ కూడా ఓకే రకమైన ప్రాసెసర్ కెపాసిటీ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 720G నీ ఏర్పాటు చేయటం జరిగింది. Xiaomi ఇందులో ఛార్జింగ్ త్వరగా అవ్వటం కోసం 33W ఛార్జర్ నీ అందిస్తోంది దీంతో ఛార్జింగ్ 50% కేవలం అరగంటలో అవుతుంది అని తెలిపింది. అలాగే ఈ మోడల్ లో sim స్లాట్ మరియు మెమరీ కార్డ్ స్లాట్ ఇవ్వటం ద్వారా రెండు సిం కార్డ్స్ మరియు మెమరీ 512 GB వరకు పెంచుకోవచ్చు.

ఈ నోట్ 9 ప్రో మ్యాక్స్ లో బ్యాటరీ గా 5020 Li polymer నీ జత చేయటం జరిగింది. ఇక ఈ ఫోన్ display సైజ్ వచ్చేసరికి 6.67 ఇంచేస్ గా ఉంటుంది.

ఇక రెడ్ మీ నోట్ 9 ప్రో మాక్స్ మొబైల్ అమెజాన్, ఎమ్ ఐ స్టోర్ మరియు ఎమ్ ఐ హోమ్స్ కొనుగోలు చేయవచ్చు. ఇక భారత్ మార్కెట్ లో మార్చ్ 25, 2020 నుండి అందుబాటులో వచ్చే అవకాశం ఉంది.


రెడ్మి నోట్ 9 సీరీస్ నేడే విడుదల


నమస్తే, xiaomi ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు redmi note సీరీస్ లో భాగంగా రెడ్మి నోట్ 9,9 ప్రో, 9 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ మోడల్స్ లాంచ్ చేయబోతోంది. ఈ మోడల్స్ కి చెందిన ఫ్యూచర్స్ మరియు ధరలు కూడా అదే సమయంలో షియోమి విడుదల చేస్తుంది. ఇక ఈ నోట్ 9 సీరీస్ లో వస్తున్న మోడల్స్ 5G సపోర్ట్ మరియు క్వాడ్ కెమెరా లు కలిగి ఇండియన్ కస్టమర్ లు కొనుగోలు చేసే ధరల్లో నే ఉంటాయి అనీ xiaomi ఒక టీజర్ పిక్ నీ రిలీజ్ చేసిన దాని బట్టి తెలుస్తోంది. ఇక ఈ మోడల్స్ లో telephoto ఫీచర్ కెమెరా ఉన్నట్లు అలాగే వీటిల్లో బారి పెర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్, బ్యాటరీ, గేమింగ్ మరియు త్వరగా ఛార్జింగ్ అయ్యే సదుపాయం ఉన్నట్లు కూడా తెలుస్తోంది.

Saturday, March 7, 2020

ఈ వాల్ పేపర్ నచ్చితే డౌన్లోడ్ చేసుకోండి

నమస్తే, కింద ఇచ్చిన వాల్ పేపర్ నచ్చితే డౌన్లోడ్ చేసుకోండి మరియు మీ మొబైల్ వాల్ పేపర్ గా పెట్టుకోండి.ఇక ఈ వాల్ పేపర్ 1080×1920 పిక్సెల్ సైజ్ కలిగినది కావున స్క్రీన్ సైజ్ చుస్కొని ఈ వాల్ పేపర్ డౌన్లోడ్ చేసి మీ యొక్క ఫోన్ పై వాల్ పేపర్ గా సెట్ చేసుకోండి. ఇక మీ యొక్క మొబైల్ లో స్క్రీన్ షాట్ తీసి వివరాలోకి వెళ్లి చూస్తే వాల్ పేపర్ యొక్క పిక్సెల్స్ సైజ్ తెలుస్తాయి దాని ప్రకారం ఈ యొక్క వాల్ పేపర్ డౌన్లోడ్ చేసి కూడా పెట్టుకోవచ్చు.
ఇక కింద ఇచ్చిన వాల్ పేపర్ డౌన్లోడ్ చేయాలి అంటే ఇమేజ్ పై లాంగ్ ప్రెస్ చేయండి ఒక బాక్స్ వస్తుంది అందులో download image పై క్లిక్ చేయండి అంతే ఇప్పుడు గ్యాలరీ లోకి వెళ్లి డౌన్లోడ్ అయిన ఈ యొక్క ఇమేజ్ నీ వాల్ పేపర్ గా పెట్టుకోండి. మీ అభిప్రాయం కామెంట్ లో తెలపండి ఈ వాల్ పేపర్ ఎలా ఉందో.

Thursday, March 5, 2020

వాట్సప్ డార్క్ థీమ్ ఎలా పెట్టుకోవాలో చూడండి

నమస్తే, వాట్సప్ యూజ్ చేస్తున్నట్లు ఐతే మీకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే వాట్సప్ డెవలపర్స్ లేటెస్ట్ అప్డేట్ లో భాగంగా డార్క్ థీమ్ ఫీచర్ ని యాప్ లో యాడ్ చేశారు. ఈ ఫీచర్ తీసుకురావటానికి ప్రధాన కారణం కంటి పై వత్తిడి తగ్గించటం కోసం అని వాట్సప్ తెలిపింది. ఇక ఈ డార్క్ మోడ్ లో పెట్టటం ద్వారా బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఎక్కువుగా అవ్వదు. ఇక ఈ డార్క్ మోడ్ లో ఎలా పెట్టాలో కింద వివరంగా ఇవ్వటం జరిగింది.
1. ముందుగా వాట్సప్ యాప్ ప్లే స్టోర్ లో వచ్చిన అప్డేట్ నుండి అప్డేట్ చేసుకోండి.ఒక వేళ అప్డేట్ రాకపోతే వెయిట్ చేయండి న్యూ ఫీచర్ కోసం వేరే వాటి నుండి అప్డేట్ చేసుకోకపోవడం మంచిది.
2. ఇక అప్డేట్ చేసుకున్న వాట్సప్ యాప్ ఓపెన్ చేయండి.పైన 3 డాట్స్ పై క్లిక్ చేయండి
3.ఇప్పుడు whatsapp>settings లోకి వెళ్లండి.
4.ఇప్పుడు కొన్ని సెట్టింగ్స్ కి మెనూ లిస్ట్ కనిపిస్తుంది అందులో chats పై క్లిక్ చేయండి.
5. Chats పై క్లిక్ చేసిన మరొక స్క్రీన్ వస్తుంది అందులో theme అని ఉంటుంది దాని పై క్లిక్ ఇస్తే choose theme అని బాక్స్ వస్తుంది అందులో light/dark అని ఉంటాయి అందులో dark ఎంచుకునీ ok పై క్లిక్ చేయండి.

అంతే మీ వాట్సప్ ఇప్పుడు డార్క్ థీమ్ లోకి మారిపోతుంది.

Wednesday, March 4, 2020

నా అంచనా ప్రకారం రియల్ మీ 6 మరియు 6 ప్రో ధరలు

నమస్తే, రియల్ మి 6 మరియు 6 ప్రో ధరలు ఇలా ఉండే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్న. ఎందుకంటే రియల్ మీ ఒక ప్రకటనలో ఈ యొక్క సీరీస్ లో వస్తున్న మొబైల్స్ ధరల పై చిన్న క్లూ లాంటిది ఇవ్వటం జరిగింది. దాని బట్టి చూస్తే రియల్ మీ 6 మరియు 6 ప్రో అనే మోడల్ స్మార్ట్ ఫోన్ లు రియల్ మీ 5 మరియు 5 ప్రో మోడల్ స్మార్ట్ ఫోన్ లకు కొనసాగింపుగా వస్తున్నవి కాదు అలాగే పూర్తి కొత్త డిజైన్ వంటి వాటి తో వస్తున్నవి అలాగే ఇందులో రియల్ మీ 6 ఏదైతే ఉందో అది ఒక ప్రో మోడల్ గా ఉంటుంది అని తెలుస్తోంది అంటే దీని బట్టి #Realme6 యొక్క ధర 12 వేలు కన్న ఎక్కువ లేదా తక్కువగా ఇక #Realme6Pro ధర 17వేల కన్న ఎక్కువ/తక్కువ ఉండవచ్చు. ఐతే ఈ ధరలు రేపు అఫిషియల్ గా ఆన్లైన్ ఈవెంట్ లో రిలీజ్ చేయనున్నారు coronavirus కారణంగా ఆఫ్ లైన్ ఈవెంట్ జరగటం లేదు అని తెలుస్తోంది. అలాగే వీటి యొక్క అసలు ధరలు మరియు మరిన్ని వివరాలు రేపు రానున్నాయి.

Saturday, February 22, 2020

నచ్చిన వెబ్సైట్ ని ఇలా సెట్ చేసుకోండి

నమస్తే, కొన్ని సార్లు ఒకే వెబ్సైట్ పదే పదే ఓపెన్ చేయల్సిన అవసరం ఉంటుంది దానికోసం సెర్చ్ లో  టైప్ చేసి ఎంటర్/గో ఇస్తే కానీ వెబ్సైట్ లోకి వెళ్లలెం కదా మరి అటువంటి వెబ్సైట్ లేదా కొన్ని నచ్చిన వెబ్సైట్ లను విండోస్ 10 లో  డెస్క్టాప్/స్టార్ట్ మెనూ పై వెబ్సైట్ లను త్వరగా ఓపెన్ చేసుకునే విధంగా సెట్ చేసుకోవచ్చు అందుకోసం కింద స్టెప్స్ వారీగా ఇవ్వటం జరిగింది చూడండి.

క్రోమ్ బ్రౌజర్ :

క్రోమ్ బ్రౌజర్ నుండి ఒక వెబ్సైట్ ని విండోస్ డెస్క్టాప్ లో taskbar పై సెట్ చేసి త్వరగా ఓపెన్ చేయటం ఎలానో చూడండి.
1. క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి ఏదైనా వెబ్సైట్ లేదా ఎక్కువగా వెబ్సైట్ ఓపెన్ చేయండి.
2. ఇప్పుడు టాప్ రైట్ కార్నర్ లో మూడు చుక్కలు కనిపిస్తాయి దాని పై క్లిక్ చేయండి.
3.ఇప్పుడు వచ్చే మెనూ లో more tools పై మౌస్ ని ఉంచితే మరొక మెనూ వస్తుంది అందులో create shortcut పై క్లిక్ చేయండి.
4. ఇప్పుడు స్క్రీన్ పై ఒక బాక్స్ వస్తుంది అందులో క్రియేట్ పై క్లిక్ చేస్తే ఆ యొక్క వెబ్సైట్ డెస్క్టాప్ పై ఐకాన్ రూపంలో కనిపిస్తుంది.
5.ఇప్పుడు వెబ్సైట్ ఐకాన్ పై రైట్ క్లిక్ చేస్తే మెనూ వస్తుంది అందులో pin to taskbar /pin to start లో నచ్చినది సెలెక్ట్ చేస్తే మీ వెబ్సైట్ షార్ట్కట్ create అవుతుంది అంతే ఇక నుండి సింపుల్ గా మీకు నచ్చిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అది కూడా taskbar నుండి లేదా స్టార్ట్ మెనూ నుండి.

● ఎడ్జ్ బ్రౌజర్ :

ఇక edge బ్రౌజర్ లో ఓపెన్ చేసే వెబ్సైట్ లను ఎలా షార్ట్కట్ చేసి taskbar/start menu లో యాడ్ చేయాలో చూడండి.
1. ఎడ్జ్ బ్రౌజర్ ఓపెన్ చేసి నచ్చిన / పదే పదే వాడే వెబ్సైటు ఓపెన్ చేసి సెట్టింగ్స్ ఐకాన్ పై క్లిక్/ 3 డాట్స్ పై క్లిక్ చేస్తే మెనూ వస్తుంది.
2. అందులో కనిపించే more tools పై క్లిక్ చేస్తే మరొక మెనూ వస్తుంది అందులో pin to taskbar సెలెక్ట్ చేస్తే సరిపోతుంది నచ్చిన వెబ్సైట్ taskbar పై షార్ట్కట్ క్రియేట్ అవుతుంది.

● ఫైర్ ఫాక్స్ :

ఫైర్ ఫాక్స్ లో ఒక వెబ్సైట్ ని వేగంగా ఓపెన్ చేయాలి అంటే  చెప్పిన విధంగా చేయండి ఇది పూర్తిగా పై బ్రౌజర్ లకు డిఫరెంట్ గా ఉంటుంది.
మీకు ఏ వెబ్సైట్ త్వరగా  చేయాలి అంటే ఆ వెబ్సైట్ యొక్క లింక్ ని కాపీ చేయండి.
1.ఇప్పుడు ఫైర్ ఫాక్స్ పై రైట్ క్లిక్ చేసి properties పై క్లిక్ చేయండి.
2. అందులో ఉండే shortcut పై క్లిక్ చేస్తే target అని ఉంటుంది అందులో firefox.exe" అని ఉన్న దాని పక్కన కాపీ చేసిన లింక్ ని పేస్ట్ చేసి ok చేయండి అంతే మీకు కావలసిన వెబ్సైట్ యొక్క షార్ట్కట్ అయింది ఇప్పుడు దాన్ని taskbar/start menu లోకి పెట్టుకొని ఓపెన్ చేయండి.

నోట్ : ఇక ఆ వెబ్సైట్ ఏ బ్రౌజర్ నుండి షార్ట్కట్ గా చేసారో అందులో మాత్రమే ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.


Thursday, February 20, 2020

ఎమోజీ కిచెన్ అనే కాన్సెప్ట్ తో gboard కీబోర్డ్

నమస్తే, గూగుల్ gboard కీబోర్డ్ యాప్ బీటా వెర్షన్ లో ఎమోజీ కిచెన్ అనే కాన్సెప్ట్ తో ఎమోజీ లను కొత్త గా తీసుకొని రావటం జరిగింది. ఐతే ఈ ఎమోజీ కిచెన్ అనేది ప్రస్తుతానికి బీటా వెర్షన్ లో ఆండ్రాయిడ్ యూజర్లల కోసం అందుబాటులో ఫిబ్రవరి 12 అప్డేట్ లో రావటం జరిగింది. ఇక ఈ ఫీచర్ పూర్తి వెర్షన్ లో రావటానికి కొంచెం సమయం పెట్టె అవకాశం ఉంది. ఈ యొక్క కొత్త ఫీచర్ ఎలా ఉపయోగపడుతుంది అంటే gboard లో ఉండే ఏదైనా ఎమోజీ అంటే ఒక నవ్వుతున్న ఎమోజీ లాంటిది ఎంచుకుంటే అలాంటి మిగతా ఎమోజీ లు రకరకాల గా వస్తాయి లేదా ఒక emoji  మరొక ఎమోజీ కలిపితే కొత్త రకం ఎమోజీ రావటం జరుగుతుంది. కింద example చూడండి

పైన ఇచ్చిన విదంగా రకరాకల ఎమోజీ లను సొంతంగా క్రియట్ చేసి emoji kitchen తో మిరే మెసేజ్ లో పెట్టవచ్చు. మరి ఈ అప్డేట్ మీకు కావాలి అనుకుంటే ప్లే స్టోర్ లో ఉండే gboard యాప్ లోకి వెళ్తే join beta program చేసుకోవాలి అంతే ఈ ఫీచర్ మీ గూగుల్ కీబోర్డ్ లో యాడ్ అయిపోతుంది లేదు అంటే ఫుల్ వెర్షన్ రిలీజ్ అయే వరకు ఆగటం మంచిది.


Tuesday, February 18, 2020

ఫిబ్రవరి 25న మెగా మాన్స్టర్ లాంచ్


నమస్తే, సామ్ సాంగ్ గెలాక్సీ m సిరీస్ లో కొత్త స్మార్ట్ ఫోన్ #GalaxyM31 అనే మోడల్ రావటం జరిగింది. ఈ స్మార్ట్ ఫోన్ ని samsung ఫిబ్రవరి 25న 1pm కి ఆన్లైన్ లో అమ్మకానికి అందుబాటులో తెస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ మోడల్ 6000mAh బ్యాటరీ కెపాసిటీ కలిగినది అమర్చటం చేత మెగా మాన్స్టర్ (#MegaMonster) గా కూడా ఈ మోడల్ పిలుచుకోవటం జరుగుతోంది. ఇక ఈ m31 మోడల్ లో మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే 4 కెమెరాలు కలిగి ఉండటం అందులో ప్రదనమైన కెమెరా 64ఎంపి కలిగినది ఏర్పాటు చేయటం జరిగింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర 15,999₹ గా ఉంటుంది అని తెలుస్తోంది.

Monday, February 17, 2020

మీ లాప్టాప్/మొబైల్/డెస్క్టాప్ లొనే రేషన్ కార్డ్ స్టేటస్ చూసుకోండి

నమస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డ్ అనేది పెద్ద టాపిక్ అనే చెప్పాలి.ఇక గవర్నమెంట్ కూడా పబ్లిక్ తమ రేషన్ కార్డ్ యొక్క స్టేటస్ ఏంటి అనేది తెలుసుకోవటం కోసం ఒక ఆన్లైన్ సర్వీస్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ సర్వీస్ లో ప్రజలు తమ దగ్గర ఉన్న మొబైల్ లేదా లాప్టాప్ లో ఫ్రీ గానే తమ యొక్క రేషన్ నెంబర్ ని ఎంటర్ చేసి వివరాలు చూసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా రేషన్ కార్డ్ యొక్క స్టేటస్ అనేది ఎలిజిబుల్ లో ఉందా లేదా అనేది ఈజీ గా తెలిసుకోవచ్చు.అందుకోసం కింద లింక్ ఇవ్వటం జరిగింది మీ యొక్క రేషన్ స్టేటస్ ఎంటో చూసుకోండి.


https://www.spandana.ap.gov.in/navasakam/rationcardstatus.aspx

Friday, February 14, 2020

poco x2 స్పెషల్స్ తెలియాలి అంటే చూడాల్సిందే

నమస్తే, పోకో ఎక్స్2 అనే మొబైల్ మోడల్ ని xiaomi విడుదల చేసింది. ఏంటి xiaomi అంటున్నారు అనుకోకండి మీరు చదివింది కరెక్ట్ నే xiaomi ఈ యొక్క poco బ్రాండ్ తో మొబైల్స్ ని విడుదల చేస్తోంది.ఇప్పటికే ఒప్పో రియల్ మీ అనే బ్రాండ్ తో మొబైల్స్ మార్కెట్ లో తెస్తోంది అలాగే xiaomi కూడా. ఇక పోకో x2 లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
1. ఈ పోకో ఎక్స్2 (poco x2) వెనుక 4 కెమెరాలు అందులో 64 మెగాపిక్సెల్,8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్,2 మెగాపిక్సెల్ మరియు 2 మెగాపిక్సెల్ macro ఇవ్వటం జరిగింది.
2. ముందు భాగం లో రెండు కెమెరా లు అందులో ఒకటి 20 మెగా పిక్సెల్ మరొకటి 2 మెగాపిక్సెల్ జత చేయటం జరిగింది.
3.పవర్ బటన్ ఉండే స్థానంలో పవర్ మరియు ఫింగర్ ప్రింట్ స్కానర్ కి ఒకే బటన్ ఇవ్వటం జరిగింది.ఇందులో ఫేస్ అన్ లాక్ కూడా ఇవ్వటం జరిగింది.
4.128FPS అనే మరొక ఆప్షన్ ఇవ్వటం జరిగింది. ఇది గేమింగ్ కోసం ఉపయోగపడుతుంది.
5.4k లో వీడియో రికార్డ్ చేసుకునే వెసులుబాటు ఇందులో ఉంది.
6.ఈ ఫోన్ తో 27w ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వటం తో మొబైల్ ఛార్జింగ్ చాలా త్వరగా చేసుకోవచ్చు.
7.ఇక ఈ మోడల్ లో ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 10 మరియు miui 11 లను పెట్టటం ఇక సెక్యురిటి ప్యాచ్ గా డిసెంబర్ కి చెందిన వెర్షన్ తో వస్తోంది.
8. ఈ పోకో x2 లో ప్రాసెసర్ చూసుకుంటే qualcomm snapdragon 730G ని ఇచ్చారు ఇది లేటెస్ట్ ప్రాసెసర్ అలాగే గేమింగ్ మరియు ఇతర వాడకంలో ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది.
9. ఇక display విషయానికి వస్తే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ని ఫ్రంట్ మరియు బ్యాక్ ఇవ్వటం జరిగింది.
10. పోకో నుండి వచ్చే మొబైల్స్ లో ప్రత్యేక యాప్ లాంచర్ వస్తున్న సంగతి తెలిసిందే అలాగే ఇందులో కూడా ఉంది.
11. ఈ మోడల్ 6GB RAM & 64GB ROM, 6GB RAM & 128GB ROM మరియు 8GB RAM & 256GB ROM వేరియంట్ లో మార్కెట్ లో అందుబాటులో తేవడం జరిగింది.
12. xiaomi అందించే అన్ని యాప్స్ కూడా ఇందులో కూడా ఉండటం అలాగే IR blaster, సెకండరీ నాయిస్ క్యాన్సల్ mic ఇవ్వటం జరిగింది.
13. ఇక ఈ మోడల్ లో నెట్వర్క్ విషయానికి వస్తే అందులో ముందుగా సిం స్లాట్ గురుంచి చూసుకుంటే రెండు సిమ్ లు లేదా ఓక సిమ్ మరియు మెమరీ కార్డ్ వేసుకునే విదంగా స్లాట్ ఇవ్వటం జరిగింది.